వెంటనే పీఆర్సీ బకాయిలు చెల్లించాలి
రాష్ట్రంలోని పెన్షనర్లకు గత మూడేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో నగదు రహిత వైద్యసేవలు అందించాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
- నగదురహిత వైద్యసేవలు అందించాలి
- పెన్షనర్ల జేఏసీ చైర్మన్ డిమాండ్
కవాడిగూడ, ఆగస్టు 7 : రాష్ట్రంలోని పెన్షనర్లకు గత మూడేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో నగదు రహిత వైద్యసేవలు అందించాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జేఏసీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంతోపాటు ఫిట్మెంట్తో కలిపి పీఆర్సీ, డీఏ చెల్లిస్తామన్న హామీని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ఆలిండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డీ సుధాకర్, మాజీ సెక్రటరీ జనరల్ పూర్ణచందర్రావు, ఫైనాన్స్ సెక్రటరీ రాజేంద్రబాబు, జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

