అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఇసుదాన్ గద్వి ఓటమి పాలయ్యారు. ఖాంభలియా స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. సుమారు 19 వేల ఓట్ల తేడాతో ఇసుదాన్ పరాజయాన్ని చవి చూశారు. బీజేపీ అభ్యర్థి అయ్యర్ ములుభాయ్ హర్ధస్భాయ్ బేరా చేతిలో ఆయన ఓటమి చెందారు. మూడవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అర్జన్‌భాయ్ ఉన్నారు. టీవీ జర్నలిస్టు ఇసుదాన్ 2021లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కేవలం అయిదు స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్‌లో ఉంది.