న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధిపతి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై రాళ్లు విసిరారు. (Arvind Kejriwal’s car attacked) బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాల పనిగా ఆప్ ఆరోపించింది. అయితే దీనిని ఆయన ఖండించారు. కేజ్రీవాల్ కారు ఇద్దరు యువకులను ఢీకొట్టిందని విమర్శించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఉన్న కారుపై రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ కారును అక్కడి నుంచి పంపివేశారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో ఆప్ పోస్ట్ చేసింది. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించింది. ‘ఓటమి భయంతో బీజేపీ ఆందోళన చెందుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి తన గూండాలను ఉపయోగించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. ఆయనను గాయపరిచేందుకు ప్రయత్నించారు. కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా చేయాలనుకున్నారు. బీజేపీ వ్యక్తుల పిరికి దాడికి కేజ్రీవాల్ భయపడరు. ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం ఇస్తారు’ అని ఎక్స్‌లో పేర్కొంది.
మరోవైపు ఆప్ ఆరోపణలను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టిందని ఆరోపించారు. ‘ప్రజలు ప్రశ్నలు అడుగుతుండగా, అరవింద్ కేజ్రీవాల్ తన కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టారు. వారిద్దరినీ లేడీ హార్డింగ్ ఆసుపత్రికి తరలించారు. ఓటమిని ఎదురుగా చూసిన ఆయన, ప్రజల ప్రాణాల విలువను మరిచిపోయారు. నేను ఆసుపత్రికి వెళ్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
हार के डर से बौखलाई BJP, अपने गुंडों से करवाया अरविंद केजरीवाल जी पर हमला‼️
BJP प्रत्याशी प्रवेश वर्मा के गुंडों ने चुनाव प्रचार करते वक्त अरविंद केजरीवाल जी पर ईंट-पत्थर से हमला कर उन्हें चोट पहुंचाने की कोशिश की ताकि वो प्रचार ना कर सकें।
बीजेपी वालों, तुम्हारे इस कायराना… pic.twitter.com/QcanvqX8fB
— AAP (@AamAadmiParty) January 18, 2025