AAP | హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana elections) పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య స్పష్టత రాలేదు. సీట్ షేరింగ్‌పై స్పష్టత రాకపోవడంతో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తోంది. సోమవారం 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన ఢిల్లీ పార్టీ.. ఇవాళ మరో జాబితాను కూడా విడుదల చేసింది. రెండో జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
Haryana elections | AAP releases its second list of 9 candidates. pic.twitter.com/47hwcCkRSq
— ANI (@ANI) September 10, 2024
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే నెలలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని ఢిల్లీ పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ ఏడింటిని మాత్రమే వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటివరకూ పొత్తు చర్చలు ఓ కొలిక్కి రాలేదు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీపై ఆప్ హర్యానా చీఫ్ సుశీల్ గుప్తా (Sushil Gupta) ఆసక్తికరంగా స్పందించారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంటుందని తాను భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Haryana elections | Delhi: AAP Haryana chief Sushil Gupta says, “Second list of 10 candidates will be released (today). The lists of all 90 seats will be issued and 90 nominations will be filed…There are multiple names for each seat, so scrutiny and other things are… pic.twitter.com/bj3SiCZaU9
— ANI (@ANI) September 10, 2024
కాగా, వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Haryana elections | Delhi: AAP Haryana chief Sushil Gupta says, “BJP is out of the field. In this election, I think the direct contest is between Congress and Aam Aadmi Party (AAP) because there is no existence of other parties in Haryana. People of Haryana have decided… pic.twitter.com/ZvwtQimEHy
— ANI (@ANI) September 10, 2024
Also Read..
AP News | మందుబాబులా మజాకా.. పోలీసుల ముందే మద్యం బాటిళ్లతో ఉడాయింపు
Apple | ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్.. సందడి చేసిన అదితి – సిద్ధార్థ్ జంట
Rahul Gandhi | ప్రధాని మోదీపై నాకు ఎలాంటి ద్వేషం లేదు : రాహుల్ గాంధీ