Apple | ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన తదుపరి మోడల్ ఐఫోన్ 16ను (iPhone 16) యాపిల్ (Apple) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. సోమవారం కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఈవో టిమ్ కుక్ ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ జంట అదితి రావు హైదరి (Aditi Rao Hydari), సిద్ధార్థ్ (Siddharth) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ (Tim Cook)తో కలిసి సందడి చేశారు. ఫొటోలకు ఫోజులిస్తూ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అదితి ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ‘మరపురాని’ అనుభవం అంటూ రాసుకొచ్చారు. అత్యంత మధురమైన, దయగల వ్యక్తిగా టిమ్‌కుక్‌ను అభివర్ణించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా, కాలిఫోర్నియాలోని యాపిల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఒకేసారి ఐఫోన్16తోపాటు యాపిల్ వాచ్ ఎక్స్, ఎయిర్బడ్డ్, హెడ్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రంగుల్లో లభించనున్న ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మాడళ్లను ఆవిష్కరించింది. వచ్చేవారంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈఫోన్లు రూ.65 వేల ప్రారంభ ధర కాగా, గరిష్ఠంగా రూ.74 వేల స్థాయిలో లభించనున్నది.
వాచ్: సిరీస్ 9, 10లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రంగుల్లో లభించనున్న ఈ వాచ్‌లో వాతావరణం, రైళ్ల సమాచారం కూడా పొందవచ్చును.
Also Read..
Killer wolfs | ఆపరేషన్ భేడియా సక్సెస్.. బోనులో చిక్కిన ఐదో తోడేలు
Train | మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. ట్రాక్‌పై బరువైన సిమెంట్ దిమ్మెలు
KCR | శ్వేతా లక్ష్మారెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం