AAP | హర్యానా ఎన్నికల్లో (Haryana Polls) ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకూ హస్తం పార్టీతో దోస్తీ కోసం చర్చలు జరిపిన ఈ ఢిల్లీ పార్టీ.. ఆ చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే 29 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. తాజాగా మూడో జాబితాను (3rd List) కూడా విడుదల చేసింది. 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకూ 40 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
గత ఐదు రోజులుగా కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అవి ఫలవంతం కాలేదు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని ఢిల్లీ పార్టీ భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ (Congress) మాత్రం ఏడింటిని కేటాయించేందుకు మాత్రమే సిద్ధంగా ఉంది. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లు తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆప్ సోమవారం 20 మంది అభ్యర్థులతో కూడి తొలి జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత మంగళవారం ఉదయం 9 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. ఇక ఇప్పుడు మూడో జాబితాలో భాగంగా 11 మందిని అభ్యర్థులుగా ప్రకటించింది.
📢Announcement 📢
The Party hereby announces the third list of candidates for the state elections for Haryana Assembly.
Congratulations to all 💐 pic.twitter.com/XvZmY67yJr
— AAP (@AamAadmiParty) September 10, 2024
తాజా జాబితాలో గర్హి సంప్లా – కిలోయ్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాపై ప్రవీణ్ గుస్ఖానీని పోటీలో నిలిపింది. 2019లోనూ హర్యానా ఎన్నికల్లో 90 స్థానాలకు గానూ ఆప్ 46 స్థానాల్లో పోటీ చేసింది. అయితే, ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు.
వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Maruti Nagar Subramanyam | రావు రమేశ్ మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీ ప్లాట్ఫాం ఫిక్స్..!
Killer wolfs | యూపీలో మరోసారి తోడేలు దాడి.. 11 ఏళ్ల బాలికకు గాయాలు
KTR | కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతున్నట్లు అనిపిస్తోంది : కేటీఆర్