US-Russia : వెనెజువెలా దేశాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశానికి చెందిన చమురు నౌకపై కన్నేసింది. రెండు వారాలుగా వెనెజువెలాకు చెందిన చమురునౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా.. రష్యా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ.. అమెరికా, ఆ నౌకను సీజ్ చేసిందని సమాచారం.
అట్లాంటిక్ సముద్రంలో, బెల్లా-1 అనే ఒక చమురు నౌక ప్రయాణిస్తోంది. వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికా ఆ నౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అక్కడికి ప్రత్యేక నౌకను పంపింది. కానీ, సముద్ర జలాల్లో ఆటుపోట్ల కారణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇదే క్రమంలో రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మోహరించింది. అయినప్పటికీ అమెరికా ఆ నౌకను ఐస్ లాండ్ తీరంలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.
అమెరికా నౌకదళం, సైన్యం సంయుక్తంగా ఈ పని చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థతి ఏర్పడింది. ఇటీవల వెనెజువెలాపై అమెరికా దాడి చేసి, అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 24 మందికిపైగా వెనెజువెలా సెక్యూరిటీ మరణించినట్లు సమాచారం.