న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఢిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించిన తీర్మానంపై నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు బీజేపీ చేసిన ఆరోపణలను ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే ఆ ఫోర్జరీ పేపర్లను చూపాలని బీజేపీకి సవాల్ విసిరారు.
బీజేపీ ద్వంద్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నందునే తన గొంతు నొక్కేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన ఢిల్లీ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న తీర్మానంపై ఎంపీ రాఘవ్ చద్దా తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్టు నలుగురు ఎంపీలు చేసిన ఫిర్యాదును రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రివిలేజ్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే.