Arvind Kejriwal | న్యూఢిల్లీ, జనవరి 25: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్మంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శనివారం తన ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని పోస్టర్ యుద్ధాన్ని ఉధృతం చేసింది. ఆప్ చేపట్టిన పోస్టర్ ప్రచార పోరులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి ప్రముఖస్థానాన్ని దక్కించుకున్నారు.
కేజ్రీవాల్ పార్టీ నిజాయితీ విశ్వాసం లేని వ్యక్తులందరినీ ఓడిస్తుంది అన్న శీర్షికతో ఆప్ రూపొందించిన పోస్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎంయోగి తదితరుల ఫోటోలు ఉన్నాయి. అయితే రాహుల్ ఫోటో కూడా ఈ పోస్టర్లో ఉండడంతో కాంగ్రెస్తో ఆప్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగినట్టుగా భావిస్తున్నారు.