రాజ్యసభకు హర్భజన్, సందీప్, రాఘవ్, సంజీవ్, అశోక్
చంఢీఘడ్: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రం నుంచి అయిదుగురు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 31న పంజాబ్‌లోని ఏడు రాజ్యసభ స్థానాలకు అయిదింటిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ ఆ అయిగురి పేర్లను ఇవాళ ప్రకటించింది. క్రికెటర్ హర్భజన్‌తో పాటు డాక్టర్ సందీప్ పాటక్, ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అశోక్ మిట్టాల్, కృష్ణ ప్రాణ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేర్ ఛారిటెబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సంజీవ్ అరోరా పేర్లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఇవాళ ఆప్ ప్రకటించింది. క్రికెటర్ హర్భజన్‌కు స్పోర్ట్స్ వర్సిటీ బాధ్యతలు కూడా అప్పగించేందుకు ఆప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐఐటీ ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన పాఠక్.. చాన్నాళ్ల నుంచి ఆ పార్టీ వ్యూహాకర్తగా కొనసాగుతున్నారు. కేంబ్రిడ్జ్ వర్సిటీలో పాఠక్ పీహెచ్డీ పూర్తి చేశారు. కేజ్రీవాల్ టీమ్‌లో పాఠక్ కీలక వ్యక్తిగా నిలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

