Coaching centre tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఉవ్వెత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటన దురదృష్టకరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఇది దురదృష్టకర ఘటన, పలు కోచింగ్ సెంటర్లు లైబ్రరీల్లో నడుపుతూ బేస్మెంట్లో చట్టవిరుద్ధంగా క్లాస్లు చెబుతున్నారని అన్నారు. ఈ ఉదంతంలో ప్రమేయమున్న అధికారులపై చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
బాధ్యులైన అధికారులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఢిల్లీ ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారని సంజయ్ సింగ్ కాషాయ నేతలను ప్రశ్నించారు. అధికారుల బదిలీ హక్కును వారు తీసేసుకున్నారని, అధికారులపై చర్యలు తీసుకునే వ్యవహారంలో మాత్రం ఎల్జీతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కపట నాటకాన్ని నగర ప్రజల ముందు తాము ఎండగడతామని సంజయ్ సింగ్ వెల్లడించారు.
Read More :