హైదరాబాద్ : తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం(Bogotha Waterfall) జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతానికి వరద పోటెత్తింది. జలపాతానికి భారీగా నీరు వస్తుండటంతో జలసవ్వడులను చూడటానికి పర్యాటకులు క్యూకడుతున్నారు. ప్రకృతి సోయగాలను తిలకించి మైమరచిపోతున్నారు. కాగా, వరద ఉధృతితో ఇటీవల బీటెక్ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందడంతో సందర్శనను నిలిపివేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల అనంతరం బొగత జలపాతం సందర్శన నిన్న తిరిగి ప్రారంభమైంది. దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చి సందడి చేశారు.
పరవళ్ళు తొక్కుతున్న బొగత జలపాతం.. జలపాతం వద్ద పర్యాటకుల సందడి
వరద ఉధృతితో బీటెక్ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందడంతో సందర్శనను నిలిపివేశారు.. నాలుగు రోజులుగా నిలిపివేసిన బొగత జలపాతం సందర్శన నిన్న తిరిగి ప్రారంభమైంది.
దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చి సందడి చేశారు. pic.twitter.com/PAR3s8UFUT
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024