న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమిలోని వివిధ పార్టీలు తలోదారిలో వెళ్తున్నాయి. జేడీయూ, ఆర్జేడీకి వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడేందుకు ఆప్ సిద్ధమైంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ఓడించేందుకు ఆప్ పావులు కదుపుతున్నది. దీనికి సంబంధించి ఆప్ బీహార్ రాష్ట్ర నాయకులతో పార్టీ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ మంతనాలు జరిపారు.
గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసినట్టుగానే.. పూర్తిస్థాయిలో పార్టీ అభ్యర్థులను నిలబెడతామని పాఠక్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ తీరుపై జేడీయూ, ఆర్జేడీ నాయకులు మండిపడ్డారు.