Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్ని వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఆటో డ్రైవర్లకు (Auto Drivers) తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ కేజ్రీని భోజనానికి ఇన్వైట్ చేశారు. ఆయన ఆహ్వానం మేరకు ఇవాళ ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో కేజ్రీ లంచ్ చేశారు. తన సతీమణి సునీతతో కలిసి తన ఇంటికి వచ్చిన కేజ్రీవాల్‌కు ఆటో డ్రైవర్ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా అక్కడ కేజ్రీ లంచ్ చేశారు (Kejriwal Have Lunch At Auto Drivers Residence).
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ వరాల జల్లు కురిపించారు. ఆటో డ్రైవర్ల కోసం ఐదు హామీలు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ కూతురి పెళ్లికి రూ.లక్ష సాయం ఇస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దీపావళి, హోలీకి రూ.2,500, ఒక్కో ఆటోడ్రైవర్‌కు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల పిల్లల పోటీ పరీక్షలకు సంబంధించిన ఫీజులు ప్రభుత్వమే చెల్లి్స్తుందని హామీ ఇచ్చారు.
#WATCH | AAP National Convenor Arvind Kejriwal says, ” I am announcing 5 things for auto drivers today which will be implemented when we come to power in Delhi again in February. First, we will give Rs one lakh on the wedding of the daughter of an auto-driver. Rs 2500 each will… pic.twitter.com/oIdZtEF8Df
— ANI (@ANI) December 10, 2024
Also Read..
Rajya Sabha chairman | రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం.. పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి
SM Krishna | ఎస్ఎం కృష్ణ మృతిపట్ల మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం