AAP | హర్యానా ఎన్నికల్లో (Haryana Polls) ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకూ హస్తం పార్టీతో దోస్తీ కోసం చర్చలు జరిపిన ఈ ఢిల్లీ పార్టీ.. ఆ చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఇవాళ తన చివరి జాబితాను రిలీజ్ చేసింది. ఏడో జాబితాలో భాగంగా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం 90 స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
AAP releases its 7th list, comprising 3 candidates, for the upcoming Haryana elections. The party has now announced candidates on all 90 assembly seats of the state. pic.twitter.com/mqu5fdrOF1
— ANI (@ANI) September 12, 2024
గత వారం కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అవి ఫలవంతం కాలేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లు తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆప్ సోమవారం 20 మంది అభ్యర్థులతో కూడి తొలి జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత మంగళవారం ఉదయం 9 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. అదే రోజు రాత్రి మూడో జాబితాలో భాగంగా 11 మందిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక బుధవారం నాలుగో జాబితాలో భాగంగా 21 మందిని ప్రకటించింది. ఇలా విడతల వారీగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
నాలుగో జాబితాలో జులానా సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)పై మరో రెజ్లర్ కవితా దలాల్‌ను ఆప్ బరిలోకి దింపింది. 2022లో కవిత ఆప్‌లో చేరిన విషయం తెలిసిందే. గతంలో డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రదర్శన ఇచ్చారు. ఇక జులానా స్థానానికి బీజేపీ అభ్యర్థిగా యోగేశ్ బైరాగి బరిలో ఉన్నారు. వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Vinesh Phogat | నాలుగు లగ్జరీ కార్లు.. రూ.కోట్ల ప్రాపర్టీ.. వినేశ్ ఫోగట్ ఆస్తుల వివరాలు ఇవే..
PM Modi | సీజేఐ ఇంట గణపతి పూజ.. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న ప్రధాని మోదీ
Ganpati Procession | గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, 56 మంది అరెస్ట్