Adani Group | న్యూఢిల్లీ, మార్చి 3: ఛత్తీస్‌గఢ్‌లో అదానీ గ్రూప్ బొగ్గు గనుల తవ్వకంపై ఆమ్ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. 2014లోనే లైసెన్సులు రద్దయిన బొగ్గు గనుల్లో అదానీ గ్రూప్ ఇప్పటికీ మైనింగ్ చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్‌సింగ్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రక్షణలోనే దేశంలోనే అతిపెద్దదైన ఈ కుంభకోణం కొనసాగుతున్నదని శుక్రవారం మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. ఈ బొగ్గు బ్లాకుల్లో మైనింగ్ విషయంలో మోదీ ప్రభుత్వం 2015లో తెచ్చిన మైనింగ్ చట్టాన్ని కూడా దారుణంగా ఉల్లంఘించారని ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బొగ్గు బ్లాకులను అభివృద్ధిచేసి, బొగ్గు తవ్వేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. ఈ లైసెన్సుల జారీపై ఆరోపణలు రావటంతో సుప్రీంకోర్టు 2014లో వాటన్నింటినీ రద్దుచేసింది. దీంతో అప్పుడే అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. గనుల అభివృద్ధి, ఖనిజాన్ని వెలికితీయటానికి లైసెన్సులు జారీచేసే అంశంపై 2015లో కొత్త చట్టం తెచ్చింది. ఇక్కడి నుంచే కుంభకోణం మొదలైందని సంజయ్‌సింగ్ ఆరోపించారు.
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పర్సా, కంటా గనుల్లో బొగ్గు తవ్వటానికి మోదీ ఎలా అనుమతించారు? ఆర్ఆర్బీయూ ఎన్ఎల్, ఏఈఎల్ జాయింట్ వెంచర్ ఒప్పందం తీవ్రమైన చట్ట ఉల్లంఘన. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. దీనిపై సీబీఐ, ఈడీతో వెంటనే దర్యాప్తు జరిపించాలి. లేదంటే మేం కోర్టును ఆశ్రయిస్తాం
– సంజయ్‌సింగ్, ఆప్ అధికార ప్రతినిధి