న్యూఢిల్లీ : చిత్ర విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు ఇంటర్నెట్లో వైరలవుతుండగా తాజాగా మామిడి రసం దోసె వీడియో (viral video) నెట్టింట తెగ వైరలవుతోంది. ఆమ్రస్ దోసెను చూసి ఇదేం ఫుడ్ కాంబినేషన్ అంటూ నెటిజన్లు నొసలు చిట్లిస్తున్నారు.
విష్2టేస్ట్ అండ్ ట్రావెల్ అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి మామిడి రసం దోసెను తయారుచేయడం కనిపిస్తుంది. దోసె తయారుచేసేందుకు అతడు పెనంపై దోసె పిండిని వేసి ఆపై దానిపై వెన్న మ్యాంగో పల్ప్ వేయడం కనిపిస్తుంది.
సర్వ్ చేసే ముందు దోసెను కట్ చేసి వాటిని కోన్స్ షేప్ కలిగిన ప్లేట్లో ఉంచుతాడు. దాంతో పాటు మామిడి రసం నింపిన కంటెయినర్‌ను ఇస్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 2 లక్షల మంది పైగా వీక్షించారు. ఈ ఫుడ్ కాంబోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఇప్పుడు అపరిచితుడు వస్తాడని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More