Aaditya Thackeray | 70 మందిని షిండే దావోస్‌కు తీసుకెళ్తున్నారు.. విదేశాంగ శాఖకు తెలుసా?: ఆదిత్య ఠాక్రే
Aaditya Thackeray | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) పలు ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం సుమారు 70 మందిని షిండే తీసుకెళ్తున్నారని విమర్శించారు.
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) పలు ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం సుమారు 70 మందిని షిండే తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఈ విషయం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలుసా? అని ప్రశ్నించారు. జాతీయ ప్రతినిధి బృందం ఇంత పెద్దగా ఎప్పుడూ లేదని అన్నారు. ఈ భారీ బృందంలో కొందరు సొంతంగా ప్రయాణించే వారు కూడా ఉన్నారని తెలిపారు. అయితే వారి ఖర్చుల కోసం ప్రజలు పన్నుగా చెల్లించిన డబ్బును వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జనవరి 15 నుంచి 19 వరకు జరుగనున్నది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పారిశ్రామిక మంత్రి ఉదయ్ సామంత్‌తో కూడిన 10 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ నుంచి క్లియరెన్స్ ఉందని ఆదిత్య ఠాక్రే తెలిపారు. వీరితోపాటు వారి జీవిత భాగస్వామ్యులు, పిల్లలు, బంధువులతో కలిసి ఈ సంఖ్య 70కు పైగా ఉందన్నారు. ‘ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు దీని గురించి తెలుసా? 70కు పైగా ఉన్న ఈ గ్రూప్‌కు రాజకీయ క్లియరెన్స్ ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
There’s news on the Davos delegation of the illegal regime in Maharashtra.
The unconstitutional cm is taking a personal entourage of almost 50 people to Davos.
This includes officers, staffers and more.
One can understand at the maximum, spouses, but for some of them, their…
— Aaditya Thackeray (@AUThackeray) January 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

