ఇప్పటివరకూ మనం నగల దొంగతనానికి సంబంధించిన అనేక వీడియోలు చూశాం. కానీ ఇది వెరైటీ దొంగతనం. ఆభరణాలు కొనేందుకు వెళ్లిన ఓ మహిళ.. ఆ షాపు యజమాని కంటపడకుంగా చిన్న బంగారు ఉంగరాన్ని మింగేసింది. ఇదికాస్తా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలికి చెందినది. రాయ్‌బరేలీలోని ఓ నగల దుకాణానికి ఆభరణాలు కొనేందుకు ఇద్దరు మహిళలు వచ్చారు. షాపు యజమాని వారికి నగలు చూపించాడు. వేరే డిజైన్ కోసం వెనుకకు తిరగగానే అందులో ఒక మహిళ చిన్న బంగారు ఉంగరాన్ని మింగేసింది. ఈ వీడియో చూసి షాపు యజమాని కంగుతిన్నాడు. అనంతరం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోయారు. వెరైటీ, ఫన్నీ కామెంట్లు చేశారు.