Woman Murder | లక్నో : ఆస్తి వివాదాలతో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటవాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎటవాకు చెందిన శివేంద్ర యాదవ్(26), గౌరవ్(19) అనే ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. అయితే వీరిద్దరికి అంజలి(25) అనే మహిళతో ఆస్తి వివాదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆమెకు ఆస్తి పత్రాలు ఇస్తామని నమ్మబలికి బయటకు పిలిపించారు యాదవ్, గౌరవ్. అనంతరం ఆమెకు పీకల దాకా మద్యం తాగించి చంపేశారు. అనంతరం డెడ్‌బాడీని ఓ నదిలో పడేశారు.
ఇంటి నుంచి వెళ్లాక ఐదు రోజుల వరకు కూడా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం నది ఒడ్డున అంజలి మృతదేహం కనిపించింది. అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అంజలిని తామే హత్య చేసినట్లు శివేంద్ర యాదవ్, గౌరవ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు.