న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దక్షిణ ఢిల్లీలోని జిల్లా కోర్టులో శుక్రవారం పట్టపగలు ఓ మహిళా కక్షిదారుపై కాల్పులు జరపటం కలకలం సృష్టించింది. బాధితురాలిని వెంటనే దవాఖానకు తరలించారు. మొదట బాధితురాలితో వాదించిన నిందితుడు, ఆ తర్వాత ఆమెపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటన జరిగినప్పుడు చుట్టూ చాలా మంది లాయర్లు ఉన్నారు. న్యాయవాది దుస్తుల్లో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ శాంతిభద్రతలు కాపాడలేకపోతే తప్పుకోవాలని ఎల్జీ సక్సేనాకు చురకలంటించారు.