ఇండ్లల్లకు నది నీళ్లు.. బోటెక్కిన పెండ్లి జంట.. వీడియో
Boats for wedding: వీటన్నింటికి భిన్నంగా బీహార్‌కు చెందిన ఓ పెండ్లి జంట మాత్రం ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పడవలో ప్రయాణించింది.

పట్నా: సాధారణంగా పెండ్లిళ్లలో పిల్ల ఇంటి నుంచి పిలగాని ఇంటికి, పిలగాని ఇంటి నుంచి పిల్ల ఇంటికి ఇరుకుటుంబాల సభ్యులు, బంధుమిత్రులు వెళ్లాలంటే తప్పనిసరిగా రవాణా వాహనాలు అవసరం. స్తోమతను అనుసరించి కార్లు, లారీలు, బస్సులను ఇందుకు వినియోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ధనికులు హెలిక్యాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు. కానీ, వీటన్నింటికి భిన్నంగా బీహార్‌కు చెందిన ఓ పెండ్లి జంట మాత్రం ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పడవలో ప్రయాణించింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలోని గోబరిస్థ గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారు పెండ్లి సంబంధం కుదుర్చుకున్నారు. పిల్ల, పిలగానిది ఒకే ఊరు కావడంతో రవాణా ఖర్చులు మిగిలిపోతాయని ఆ పేద కుటుంబాలు భావించాయి. కానీ, తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్లు.. తీరా పెండ్లికి ఒక రోజు ముందు భాగమతి నది ఉప్పొంగి ఆ గ్రామం అంతటా నడుముల లోతు నీళ్లు నిలిచాయి.
దీంతో చేసేదేమీ లేక రెండు కుటుంబాల వారు మూడు నాటు బోట్లు మాట్లాడి పెండ్లి తంతు పూర్తిచేశారు. పెండ్లి పిల్ల, పెండ్లి కొడుకుతోపాటు కుటుంబసభ్యులు, చుట్టపక్కాలు అంతా ఆ బోట్లలోనే ఓ ఇంటి నుంచి మరో ఇంటికి ప్రయాణించారు. పడవల్లో పెండ్లి పిల్ల, పెండ్లి కొడుకు ప్రయాణానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ కింది వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
#WATCH | Bihar: A wedding procession reached a bride's home in Samastipur's Gobarsittha village on boats & returned with her on the same, as the village is inundated due to rise in water level of Bagmati River. Three boats were arranged by the villagers for the procession. pic.twitter.com/10U3vq3mCW
— ANI (@ANI) July 10, 2021
ఇవి కూడా చదవండి..
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

