US Air Force Plane : అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారివారి దేశాలకు వెళ్లగొడుతోంది. అందులో భాగంగానే తాజాగా భారత్‌కు చెందిన వలసదారుల (Indian Migrants) ను కూడా వెనక్కి పంపింది. మొత్తం 205 మంది భారత వలసదారులు స్వదేశానికి తిరిగొచ్చారు. టెక్సాస్ (Texas) నుంచి భారత వలసదారులతో బయలుదేరిన అమెరికా మిలిటరీకి చెందిన సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్సర్ (Amritsir) అంతర్జాతీయ విమానాశ్రయాని (International Airport) కి చేరుకుంది.
భారత్‌కు తిరిగొచ్చిన వలసదారుల్లో పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్రమ వలసదారులతో కూడిన ప్రత్యేక విమానం భారత్‌కు రావడం ఇదే తొలిసారి. కాగా విమానాశ్రయానికి చేరుకున్న వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు లేవని, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి ఎయిర్పోర్ట్ నుంచి వారిని బయటకు పంపుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా భారతీయ వలసదారులను తీసుకుని మరిన్ని విమానాలు అమెరికా నుంచి ఇండియాకు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను చెప్పేందుకు అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు. దేశ సరిహద్దులను పటిష్టం చేయడం, ఇమిగ్రేషన్ చట్టాలను కట్టుదిట్టం చేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడంపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికాలోని అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వెనక్కి పంపుతున్నారు. ఇప్పటికే గ్వాటెమాలా, పెరూ, హోండూరస్ తదితర దేశాలకు చెందిన పలువురుని స్వదేశాలకు తరలించింది. కాగా భారత్ సైతం అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని చెబుతోంది. వీసా గడువు ముగిసినా సరైన డాక్యుమెంట్లు లేకుండా చట్టవిరుద్ధంగా భారతీయులు ఎక్కడున్నా వెనక్కి తీసుకువస్తామని పేర్కొంది.
Donald Trump | గాజా స్ట్రిప్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..!
Auto driver | నటుడు విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు
IT Employee | మాదాపూర్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు