Madhya Pradesh | భోపాల్: మధ్యప్రదేశ్లోని ధార్ లో ఉన్న భోజశాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే నివేదికను ఏఎస్ఐ సోమవారం హైకోర్టుకు సమర్పించింది. ప్రస్తుత నిర్మాణాన్ని దేవాలయానికి సంబంధించిన శిథిలాలపై నిర్మించారని తెలిపింది.
స్తంభాలపై ఉన్న వాస్తు శిల్పం, కళలను బట్టి అవి దేవాలయాల్లో భాగమని తెలుస్తున్నదని వివరించింది. దేవాలయం శిథిలాలు, బ్రహ్మ దేవుడు, విష్ణు మూర్తి, గణేశుడు, తదితర విగ్రహాలు విరిగిన స్థితిలో కనిపించాయని చెప్పింది.