న్యూఢిల్లీ : ఢిల్లీలో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను కాల్చి చంపడం సంచలనం కలిగించింది. నైరుతి ఢిల్లీ ఆర్కే పురంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక వివాదాల వల్లే ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఇద్దరు మహిళల హత్యను సీఎం కేజ్రీవాల్ ఖండిస్తూ ఎల్జీ పాలనలో రోజురోజుకూ శాంతి భద్రతలు దిగజారుతున్నాయని ఆరోపించారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ హత్యలు జరిగాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు.