మొరాదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి లక్షకు తగ్గడంలేదు. తాజాగా శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కూడా 1,31,968 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోటల్లా లాక్డౌన్, నైట్ కర్ఫ్యూల వంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రజలంతా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు సామాన్య ప్రజలు, కళాకారులు తమకు తోచిన రీతిలో కరోనా మహమ్మారి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ పట్టణానికి చెందిన ఓ కళాకారుడు యమధర్మరాజు వేష ధారణలో స్థానికులకు కరోనా గురించి వివరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే ఎంత ప్రమాదమో చెబుతున్నారు. మాస్కులు ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా తాను ఎత్తుకెళ్తానని సరదాగా హెచ్చరిస్తున్నారు.
Moradabad: A local artist, dressed as Yamraj, creats awareness among people about #COVID19 pandemic, urging them to wear a mask and observe social distancing. pic.twitter.com/xeZd4fbbhE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 9, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?