విద్వేషం దేశానికి మంచిది కాదు
దేశంలో మైనారిటీలపై విద్వేషం పెరుగుతున్నదని, దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని, తప్పు చేయకపోయినా జైళ్లలో ఉండాల్సి వస్తున్నదన్నారు.
- మోదీకి సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే లేఖ
న్యూఢిల్లీ: దేశంలో మైనారిటీలపై విద్వేషం పెరుగుతున్నదని, దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని, తప్పు చేయకపోయినా జైళ్లలో ఉండాల్సి వస్తున్నదన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో జరిగిన పలు ఘటనలను తన లేఖలో ఉదహరించారు. కరోనా సమయంలో నిజాముద్దీన్ మర్కజ్ సంఘటనపై జరిగిన దుష్ప్రచారాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో అమాయక ముస్లింలు జైళ్లలో మగ్గారని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే అధికం
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే మైనారిటీలపై వేధింపులు అధికంగా జరుగుతున్నాయని, వారికి వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేసే వారిపై విచారణలు, శిక్షలు ఉండటం లేదన్నారు. విద్వేషపూరిత నేరాల నియంత్రణకు అమెరికా మాదిరిగా మన దేశం లోనూ చట్టం తీసుకురావాలని దవే కోరారు. ఇటీవల జార్జియాలో హిందూఫోబియాకు వ్యతిరేకంగా చట్టం చేశారని, ఇలాంటి వాటి నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

