లక్నో : ఓ కశ్మీరీ అయోధ్య రామాలయంలో నమాజ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది తనను అడ్డుకోవటాన్ని నిరసిస్తూ, అతడు పెద్ద పెట్టున నినాదాలు చేయటం కలకలం రేపింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. నిందితుడిని కశ్మీర్‌లోని సోఫియాన్‌కు చెందిన అబు అహ్మద్ షేక్‌గా గుర్తించారు. అతడు అయోధ్యకు ఎందుకు వచ్చాడు? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన ఆలయానికి కొన్ని వందల మీటర్ల దూరంలో అహ్మద్ షేక్ కింద బట్ట పరిచి, నమాజ్ చేసేందుకు ప్రయత్నించాడని అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ చెప్పారు. అహ్మద్‌తోపాటు మరో ఇద్దరు నినాదాలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.