కాఠ్మాండూ: శ్రీరాముని ధర్మపత్ని సీత జన్మించిన జనక్ పురి నుంచి అయోధ్యకు భారీ సారె రాబోతున్నది. నేపాల్లోని ఈ పట్టణం నుంచి 500 మంది జనవరి 6న అయోధ్యకు చేరుకుంటారు. వీరు తమతోపాటు 1,100 బుట్టలతో శ్రీరామునికి పెళ్లి కానుకలను తీసుకొస్తున్నారు. ఈ బుట్టల్లో బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా డ్రైఫ్రూట్స్, బిందెలు, వంట పాత్రలు, దుస్తులు, వస్ర్తాలు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు, బియ్యం వంటి ఆహార ధాన్యాలు ఉన్నాయి.