సోమవారం 08 మార్చి 2021
National - Jan 23, 2021 , 01:25:23

730 కోట్ల ప్రైజ్‌ మనీ!

730 కోట్ల ప్రైజ్‌ మనీ!

న్యూఢిల్లీ: ఎప్పుడూ ఆకాశం వైపు చూసే టెస్లా అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్‌ మస్క్‌ కండ్లు భూమి మీదకు మళ్లాయి. రోదసిలో విహారం గురించిన ఆలోచనలతో పాటు  వాతావరణ కాలుష్యం, భూతాపం తగ్గింపు మీద ఆయన దృష్టి పెట్టారు. భూమిపై కర్బన ఉద్గారాలను పీల్చుకొని, కాలుష్యాన్ని తగ్గించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి రూ.730 కోట్ల భారీ ప్రైజ్‌ మనీ ప్రకటించారు. పోటీ వివరాలను వారం రోజుల్లో వెల్లడిస్తానని గురువారం ట్వీట్‌ చేశారు. ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌పై చాలా మంది స్పందించారు. మస్క్‌ చెప్పిన సాంకేతికత చెట్టేనని, అందరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ‘చెట్టు కన్నా మంచి సాంకేతికతను ఎవరూ అభివృద్ధి చేయకపోతే.. అందరం తలో చెట్టును నాటుదాం’ అని ఒక నెటిజన్‌ రిైప్లె ఇచ్చాడు. 

VIDEOS

logo