మూడేండ్ల పసికందుపై గ్యాంగ్‌రేప్!.. బీహార్‌లో ఘోరం
బీహార్‌లోని పాట్నాలో అత్యంత హేయమైన ఘటన చోటుసుకున్నది. డ్రగ్స్‌కు బానిసైన 22 ఏండ్ల యువకుడు, మరో ఇద్దరు కలిసి.. మేనకోడలైన మూడేండ్ల బాలికపై గ్యాం గ్రేప్నకు పాల్పడ్డారు.
పట్నా, ఏప్రిల్ 5: బీహార్‌లోని పాట్నాలో అత్యంత హేయమైన ఘటన చోటుసుకున్నది. డ్రగ్స్‌కు బానిసైన 22 ఏండ్ల యువకుడు, మరో ఇద్దరు కలిసి.. మేనకోడలైన మూడేండ్ల బాలికపై గ్యాం గ్రేప్నకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధిత బాలికకు పాట్నాలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నామని, దోషులకు కఠిన శిక్షపడేలా చూస్తామని జిల్లా పోలీస్ ఉన్నతాధికారి రంజన్‌కుమార్ ఆదివారం విలేకర్లకు తెలిపారు.
ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, ఎఫ్ఎస్ఎల్ బృందం నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉం టుందన్నారు. బాలిక తల్లి పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం, డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు నిద్రిస్తున్న బాలికను చెట్లపొదల్లోకి ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడినట్టు చెప్పింది. బాలిక అరుపులతో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమవడంతో బాలికను అక్కడే వదిలేసి ప్రధాన నిందితుడు సహా, అతడి స్నేహితులు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. బాలికను గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- drugs
- Patna
- Ranjan Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

