బుల్దానా: మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 2020లో ‘యువ షేత్కారీ(రైతు)’ అవార్డును పొందిన ఓ అన్నదాత అయిదేండ్ల తర్వాత సాగు నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. బుల్దానా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కైలాశ్ నగ్రె(42) శివ్ని అర్మల్ గ్రామంలోని తన పొలంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘సేద్యానికి నీటి సరఫరా లేక పంట దిగుబడి పడిపోయింది. పొలాలకు సాగునీరు అందడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అతడు ప్రభుత్వాన్ని కోరాడు. తన చావుకు ఎవరినీ బాధ్యుల్ని చేయలేదు’ అని ఓ అధికారి మృతుడి సూసైడ్ నోట్లో ఉన్న విషయాలను వెల్లడించారు.