బెంగళూరు : నదులు, కాలువల్లో ఉండే మొసళ్లు చెరువుల్లోకి వస్తేనే భయపడిపోతాం. అటు వైపు వెళ్లడానికి కూడా సాహసం చేయం. మరి ఊర్లోకి మొసళ్లు వస్తే ఏం చేస్తాం. శరీరంలో వణుకు పుట్టి ఇండ్లను మూసేసుకుంటాం. ఇలాంటి ఘటనే కర్ణాటకలోని కోగిల్బాన్ గ్రామంలో చోటు చేసుకుంది. కోగిల్బాన్ గ్రామంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. దీంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లను మూసేసుకోవడంతో ఆ కాలనీ అంతా నిర్మానుష్యంగా మారింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. మొసలిని బంధించి నదిలో వదిలేశారు.
#WATCH Karnataka | A crocodile found strolling through Kogilban village in Dandeli. Later, forest officials rescued the crocodile & released it into the river. pic.twitter.com/2DDk7JuOB8
— ANI (@ANI) July 1, 2021