కర్ణాటక పీడీఎస్‌లో అవినీతి.. పర్యావరణవేత్త ఆత్మహత్య
కర్ణాటకలో అధికార బీజేపీ నేతల కమీషన్ల వేధింపులు తాళలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరువకముందే.. ఆ రాష్ట్రంలో అవినీతికి మరొకరు బలయ్యారు.
బెంగళూరు, సెప్టెంబర్ 20: కర్ణాటకలో అధికార బీజేపీ నేతల కమీషన్ల వేధింపులు తాళలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరువకముందే.. ఆ రాష్ట్రంలో అవినీతికి మరొకరు బలయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అవినీతిని భరించలేక ఓ పర్యావరణ వేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. అట్టడుగు వర్గాలకు చౌకధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోవడంపై అతడు ప్రశ్నించాడు. వారికి న్యాయం జరుగకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అయినా.. అతడు అనుకున్నది జరుగకపోవడంతో మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేవనగరె జిల్లాలో జరిగింది. రాజ్యోత్సవ అవార్డు గ్రహీత అయిన వీరాచారి (68) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు పర్యావరణ ప్రేమికుడు. ఎక్కడికెళ్లినా వెంట మొక్కలు తీసుకెళ్లి నాటుతాడు. పౌర సరఫరాల దుకాణాల్లో జరుగుతున్న అవినీతిపై చాలాసార్లు నిరసన తెలిపాడు. ప్రభుత్వం పంపిణీ చేసే సరుకులు అట్టడుగు వర్గాలకు అందడం లేదని, వారికి న్యాయం జరుగకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అయ్యింది. కాగా, మంగళవారం అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్రకృతి ప్రేమికులు, స్థానికులు ఆందోళనకు దిగారు. జిల్లా కమిషనర్ సంఘటనా స్థలానికి వచ్చి, విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న హరిహర రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని, ఆందోళన విరమింపజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

