న్యూఢిల్లీ, డిసెంబర్ 23: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, అండమాన్ నికోబార్‌లోని 95 లక్షల మంది ఓటర్లకు మంగళవారం ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు కనిపించలేదు. అండమాన్ నికోబార్ దీవుల్లోని మొత్తం 3.10 లక్షల ఓటర్లలో 64,000 ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో లేవు.
అదేవిధంగా కేరళలోని మొత్తం 2.78 కోట్ల మంది ఓటర్లలో 24.08 లక్షల మంది పేర్లు ముసాయిదాలో లేవు. ఛత్తీస్‌గఢ్‌లోని 2.78 కోట్ల మంది ఓటర్లలో 37.34 లక్షల మంది పేర్లు తొలగింపునకు గురయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 5.74 కోట్ల మంది ఓటర్లలో 42.74 లక్షల ఓటర్ల పేర్లపై వేటు పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఓటర్ల తుది జాబితా విడుదలవుతుంది.