శనివారం 04 జూలై 2020
National - Jun 30, 2020 , 11:38:22

రాజస్తాన్‌లో కొత్తగా 94 కరోనా కేసులు

రాజస్తాన్‌లో కొత్తగా 94 కరోనా కేసులు

జై పూర్‌ : కరోనా కేసులు జనాన్ని కలవరపెడుతున్నాయి. ఒక్కరు బయటికెళ్లినా ఇంటిల్లిపాది భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుండడం, కొంతమందికి అసలు లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో బికుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. 

తాజాగా రాజస్తాన్‌లో గడిచిన 24 గంటల్లో 94 కొత్త కరోనాకేసులు నమోదుకాగా, 27 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యి, నలుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం మంగళవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,754కు చేరగా అందులో 3,397 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మిగతావారు డిశ్జార్చి కాగా.. ఇప్పటివరకు మొత్తం 409 మంది కరోనాతో చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. 


logo