Boy Swallow LED bulb | ఎల్ఈడీ బల్బు మింగిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Boy Swallow LED bulb | ఒక బాలుడు ఎల్ఈడీ బల్బు మింగాడు. (Boy Swallow LED bulb) అది ఊపిరితిత్తులో చిక్కుకున్నది. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొన్న ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు.
చెన్నై: ఒక బాలుడు ఎల్ఈడీ బల్బు మింగాడు. (Boy Swallow LED bulb) అది ఊపిరితిత్తులో చిక్కుకున్నది. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొన్న ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు. బ్రోంకోస్కోపీ ద్వారా ఎల్ఈడీ బల్బును బయటకు తీశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ఎల్ఈడీ బల్బు మింగాడు. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడు.
కాగా, ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆ బాలుడ్ని తొలుత ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్రోంకోస్కోపీ ద్వారా ఎల్ఈడీ బల్బును బయటకు తీసేందుకు ప్రయత్నించిన డాక్టర్లు విఫలమయ్యారు. దీంతో ఓపెన్ సర్జరీ చేయాలని బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. అయితే ఐదేళ్ల బాలుడికి ఓపెన్ సర్జరీ ప్రమాదంతో కూడుకున్నది కావడంతోపాటు కోలుకునేందుకు ఐసీయూలో ఉంచాల్సి ఉండటంపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ బాలుడ్ని చెన్నైలోని శ్రీరామచంద్రా హాస్పిటల్‌కు తరలించారు.
మరోవైపు గత శుక్రవారం బాలుడ్ని పరీక్షించిన అక్కడి పిల్లల వైద్యులు సీటీ స్కాన్ చేశారు. ఎల్ఈడీ బల్బు బాలుడి ఊపిరితిత్తులోని శ్వాసనాళాల వద్ద ఉన్నట్లు గుర్తించారు. బ్రోంకోస్కోపీ ద్వారా తీసేందుకు ప్రయత్నిస్తామని, అది ఫలించకపోతే ఓపెన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని బాలుడి తల్లిదండ్రులకు డాక్టర్లు తెలిపారు. అయితే బ్రోంకోస్కోపీ ద్వారానే విజయవంతంగా ఎల్ఈడీ బల్బును బయటకు తీశారు. దీంతో ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం తప్పింది. అలాగే బాలుడు ఆరోగ్యంగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

