న్యూఢిల్లీ: మయన్మార్ నుంచి దాదాపు 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్‌లోకి చొరబడబోతున్నట్లు నిఘా సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినట్లు మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు.
చురచాంద్పూర్, తౌబల్‌లో జరిపిన దాడుల్లో సాధారణ ఆయుధాలతో పాటు, పిస్తోళ్లు, రైఫిల్ వంటి ఆయుధాలతో పాటు యుద్ధరంగంలో వినియోగించే రాకెట్లు, మోర్టార్ బాంబులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, మయన్మార్‌లోని చిన్ తెగవారితో మణిపూర్‌లోని కుకీ తెగవారికి సంబంధాలు ఉన్నాయి. కుకీ మిలిటెంట్లు డ్రోన్ దాడులకు పాల్పడినట్లు అధికారులు ఆరోపించారు.