న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: మార్కెట్లో నకిలీ ఔషధాల అమ్మకాల్ని అడ్డుకునేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించగా, 84 రకాల ఔషధాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆదివారం ఈమేరకు ‘సీడీఎస్సీవో’ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ఒక హెచ్చరిక జారీచేసింది. సాధారణ స్టెరాయిడ్స్, డయాబెటిస్, కొవ్వును తగ్గించే ఔషధాలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్పై వివిధ కంపెనీలకు చెందిన మందుల్లో నిర్దేశిత ప్రమాణాలు లోపించాయని ‘సీడీఎస్సీవో’ పేర్కొన్నది. 2024 డిసెంబర్లో ఆయా కంపెనీల ఔషధాల నమూనాలపై పరీక్షలు జరిపామని, దీంట్లో 84 రకాల ఔషధాల బ్యాచ్లు ‘నాణ్యత లేనివి’ (ఎన్ఎస్క్యూ)గా గుర్తించిన ట్టు సీడీఎస్సీవో తెలిపింది.నకిలీ ఔష ధాల తొలగించడానికి రాష్ట్ర సంస ్థల సహకారంతో క్రమం తప్పకుండా పరీక్షలు చేపడుతున్నట్టు పేర్కొంది.