త్రిపుర, ఫిబ్రవరి 16: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ప్రధాన ఎన్నికల అధికారి గిట్టే కిరణ్ కుమార్ దినకర్ రావు తెలిపారు.
2018 ఎన్నికల కన్నా ఒక శాతం ఎక్కువగా 80 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు దశాబ్దాల క్రితం మిజోరాం వలసపోయి తిరిగి త్రిపురకు వచ్చిన బ్రూ జాతి వారు మొదటిసారిగా పెద్ద ఎత్తున ఓటుహక్కును వినియోగించుకున్నారు. మార్చి 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.