జైపూర్: రాజస్థాన్లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కౌరలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో 8 మంది కార్మికులు ఫ్యాక్టరీలోనే సజీవ దహనమయ్యారు. కెమికల్ ఫ్యాక్టరీలో పటాసులను అక్రమంగా తయారుచేస్తున్నారని తెలిసింది.