న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు కూడా లేని సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వీరంతా ఈ ఎన్నికల్లో టికెట్లు లభించని వారే. పాలమ్ ఎమ్మెల్యే భవన్ గౌర్ ఈ మేరకు పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాస్తూ పార్టీ పట్ల తాను విశ్వాసాన్ని కోల్పోయానని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ మెహ్రౌలియా, జనక్‌పురి ఎమ్మెల్యే రాజేశ్ రిషి, కస్తుర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.