మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 12:53:06

బీహార్ ఎన్నిక‌లకు 23 ల‌క్ష‌ల గ్లౌజ్‌లు.. 7 ల‌క్ష‌ల శానిటైజ‌ర్లు

బీహార్ ఎన్నిక‌లకు 23 ల‌క్ష‌ల గ్లౌజ్‌లు.. 7 ల‌క్ష‌ల శానిటైజ‌ర్లు

హైద‌రాబాద్‌: బీహార్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఇవాళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. చీఫ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సునిల్ అరోరా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అతి పెద్ద రాష్ట్రాల్లో బీహార్ ఒక‌టి అని, కోవిడ్ వేళ ప్ర‌పంచంలో జ‌రుగుతున్న అతిపెద్ద ఎన్నిక‌ల స‌మ‌రంగా ఆయ‌న పేర్కొన్నారు.  బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  క‌రోనా నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ కార‌ణంగా.. అధిక సంఖ్య‌లో పోలింగ్ బూత్‌లు ఉంటాయ‌ని తెలిపారు.  ప్ర‌తి పోలింగ్ బూత్‌లో 1500 మందికి బ‌దులుగా వెయ్యి మందికి ఓటింగ్ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. 

23 ల‌క్ష‌ల గ్లౌజ్‌లు, 7 ల‌క్ష‌ల శానిటైజ‌ర్లు..  

మాస్క్‌లు, శానిటైజ‌ర్లు, పీపీఈ కిట్ల‌ను బీహార్ ఎన్నిక‌ల‌ను వాడ‌నున్నారు. కోవిడ్19 పాజిటివ్ రోగుల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సీఈసీ అరోరా తెలిపారు.  పోలింగ్ స‌మ‌యాన్ని గంట పెంచిన‌ట్లు చెప్పారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. కోవిడ్ నిబంధ‌న‌ల్లో భాగంగా.. ఎన్నిక‌ల వేళ 7 ల‌క్ష‌ల శానిటైజ‌ర్లు, 46 ల‌క్ష‌ల మాస్క్‌లు, 6 ల‌క్ష‌ల పీపీఈ కిట్లు, 7.6 ల‌క్ష‌ల ఫేస్ షీల్డ్‌లు, 23 ల‌క్ష‌ల హ్యాండ్ గ్లౌజ్‌లు వాడ‌నున్నారు.  ప్ర‌చారం కోసం కూడా కొత్త నియ‌మావ‌ళిని ప్ర‌క‌టించారు. 


logo