శ్రీనగర్: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో (Police Station) భారీ పేలుడు (Massiv Explosion) చోటుచేసుకుంది. దీంతో తొమ్మిది మంది మృతి చెందగా, సుమారు 30 మంది గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారు. శుక్రవారం రాత్రి 11.22 గంటల సమయంలో జరిగిన ఈ పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ ధ్వంసమైంది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి ఇటీవల సీజ్ చేసిన పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని వెల్లడించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో పార్కింగ్‌లో ఉన్న పలువాహనాలకు మంటలు అంటుకున్నాయి. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు పడ్డాయని తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్‌లోని డాక్టర్ ముజామిల్ షకీల్ ఇంట్లో హర్యానా, జమ్ము పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ 3 వేల కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకొని నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాటి నుంచి నమూనాలను తీస్తుండగా విస్ఫోటం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ పరిశీలించారు.
A massive explosion was caught on CCTV near Nowgam, Srinagar, on Friday. Fire brigade, ambulances, and senior police rushed to the site.
Further details are awaited. pic.twitter.com/LWPpHm8HKk
— IndiaWarMonitor (@IndiaWarMonitor) November 14, 2025