Platform Collapses | ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బాగ్పత్ (Baghpat)లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Platform Collapses). ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరౌత్‌లోని జైన్ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్’ (Laddoo Mahotsav)ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదినాథుడి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం నిర్వాహకులు చెక్కతో వేదికను నిర్మించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బరువు ఎక్కువై వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. తీవ్ర గాయాలతో పలువురు చికిత్స పొందుతున్నట్లు బాగ్పత్ పోలీస్ చీఫ్ అర్పిత్ విజయవర్గియా తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదం గురించి అధికారులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Also Read..
Casting Couch | ఏం చేయడానికైనా సిద్ధమేనా అని అడిగారు.. కాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్
Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు
ISRO | రేపు ఇస్రో వందో ప్రయోగం.. జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 కౌంట్‌డౌన్ షురూ