న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఈ ఏడాది రుతుపవన సీజన్లో 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిశాయని వెల్లడించింది. మధ్య, దక్షిణ, ఈశాన్య భారతంలో అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత వ్యవసాయ రంగానికి రుతుపవన సీజన్ ఎంతో కీలకం. దేశంలోని మొత్తం నికర సాగు భూమిలో 52 శాతం ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. తాగునీటికి, విద్యుత్తు ఉత్పత్తికీ ఈ వర్షాలు కీలకం.