సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 09:26:00

ప్లాస్మా దానం చేసిన 67 మంది పోలీసులు

ప్లాస్మా దానం చేసిన 67 మంది పోలీసులు

గువహతి : కరోనా నుంచి కోలుకున్న 67 మంది అసోం పోలీసు సిబ్బంది శనివారం గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్) లో పోలీసు సిబ్బంది తమ ప్లాస్మాను దానం చేశారు. ఈ సందర్భంగా వారిని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ వారిని సత్కరించారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్లాస్మా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మానవాళికి సేవ చేసేందుకు ప్లాస్మా దానం చేయమని’ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల మద్దతు, కరోనా వారియర్స్‌ ధైర్యంతో కొవిడ్‌-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మేం చాలా బాగా పని చేస్తున్నాం’ అన్నారు. ‘అస్సాం పోలీసుల సాహసోపేతమైన, నిస్వార్థమైన సేవలందిస్తున్న కరోనా వారియర్స్‌ను నేను అభినందిస్తున్నాను.. వారి సేవ విధి పిలుపునకు మించింది.. వారు మా హీరోలు’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే ప్లాస్మా దానం చేసిన సిబ్బంది పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ భాస్కర్‌ జ్యోతి మహంత అభినందించారు. ఇప్పటి వరకు 1,552  మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ రాగా, ఇందులో 1,086 మంది కోలుకున్నారు. మరో నలుగురు మరణించారు. కోలుకున్న వారిలో 279 మంది తిరిగి విధుల్లో చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo