జమ్ము: అమర్నాథ్ యాత్ర కోసం 65,000 మందికిపైగా భక్తులు నమోదు చేయించుకున్నారు. వచ్చే నెల 29 నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15న ప్రారంభమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ బ్యాంకు అధికారి ఒకరు శుక్రవారం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకు శాఖల ద్వారా 65,000 మందికిపైగా భక్తులు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. వీరిలో 70 శాతం మంది పురుషులని, 30 శాతం మంది మహిళలని చెప్పారు. జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు 52 రోజులపాటు యాత్ర కొనసాగుతుంది.