న్యూఢిల్లీ, మే 11: ఈ నెల 7న జరిగిన లోక్సభ మూడో విడత ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడో విడత 68.4 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇప్పుడు దాని కన్నా సుమారు మూడు శాతం తగ్గింది.
కాగా ఓటింగ్ జరిగిన మరునాడు సైతం ఈసీ ఇంచుమించు ఇదే పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. మూడో విడతలో 11 రాష్ర్టాలు, యూటీల్లోని 93 నియోజవకర్గాల్లో ఎన్నికలు జరగగా, 68.89 శాతం పురుషులు, 64.4 శాతం మహిళలు, 25.2 శాతం ట్రాన్స్జెండర్లు ఓటు వేశారు.