కారేపల్లి, ఫిబ్రవరి 12 : సార్వత్రిక సమ్మెను పురష్కరించుకుని వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం కారేపల్లి మండల కేంద్రంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మండల కార్యాలయాల నుండి ర్యాలీ ప్రారంభమై బస్టాండ్ సెంటర్ వరకు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు కె.నరేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వై.ప్రకాశ్, ఐక్య రైతు కూలీ సంఘం నాయకులు తేజానాయక్, పీవైఎల్ నాయకులు భూక్య శివ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు కేలోత్ రవి, జీపీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్కె.హుస్సేన్, మండల కార్యదర్శి ఎస్.నాగేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి ఎస్.నాగమణి, హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ఎల్లబోయిన రాధ, మండల అధ్యక్షురాలు వాంకుడోత్ కమల, ఈశ్వరి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరెళ్ల శ్రీరాములు, పెయింటర్స్ యూనియన్ నాయకులు శివకేశవ, జన్నీ, ఎండీఎం వర్కర్స్యూనియన్ నాయకులు ఎం.స్వరూప, విక్టోరియా, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి.వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి, టీయూసీఐ నాయకులు దారావత్ సక్రు, వడ్డే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కారేపల్లిలో కార్మికుల ర్యాలీ.. సార్వత్రిక సమ్మె విజయవంతం